Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెన్ష‌న్‌లో మ‌హేష్, బ‌న్నీ..? అస‌లు ఏం జ‌రిగింది..?

Advertiesment
టెన్ష‌న్‌లో మ‌హేష్, బ‌న్నీ..? అస‌లు ఏం జ‌రిగింది..?
, మంగళవారం, 22 అక్టోబరు 2019 (13:34 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఈ సినిమాతో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. 
 
మ‌రో వైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని కూడా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఇలా.. మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ అల‌.. వైకుంఠ‌పుర‌ములో సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండ‌డం అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తుండ‌డంతో అటు మ‌హేష్, ఇటు బన్నీ ఇద్ద‌రు క‌లెక్ష‌న్స్ ఎలా ఉంటాయి అని తెగ టెన్ష‌న్ పడుతున్నార‌ట‌. 
 
అందుక‌నే ఇప్ప‌టి నుంచి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసేసారు. ఒక‌రు స్టిల్ రిలీజ్ చేస్తే... మ‌రొక‌రు సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇలా మ‌హేష్, బ‌న్నీ సినిమాలు ప్ర‌మోష‌న్స్ విష‌యం నుంచి పోటీ ప‌డుతుండ‌డం విశేషం. మ‌రి.. సంక్రాంతి పోటీలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌ను అంత మాట అనేసిన వితికా షెరు.. బ్రదర్ అని పిలిచి చివరికి?