జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిన కమెడియన్‌లలో ఒకరైన మహేష్ పెళ్లి పీటలెక్కాడు. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి హంగులు, హడావిడి లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు.
జబర్దస్త్‌లో కిరాక్ ఆర్పీ టీమ్‌లో మెయిన్ కంటెస్టెంట్‌గా ఉన్న మహేష్ తన పంచులతో ప్రజలను ఆకర్షించడంతో పాటుగా అనేక స్కిట్‌లను విజయవంతం చేసారు. అక్కడి నుండి బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు ప్రయాణం సాగింది. ఇటీవల మహేష్ నటించిన శతమానం భవతి, రంగస్థలం, గుణ 369 చిత్రాలలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇలా కెరీర్ బాగుంటుండగా మహేష్ వివాహం పావనితో మే 14వ తేదీ ఉదయాన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద కేవలం కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. పెళ్లిలో కూడా లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా, అదే సమయంలో సాంప్రదాయాలను పాటించేలా జాగ్రత్తపడ్డారు.
శానిటైజర్, మాస్కులు వంటి ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా ఫాలో అయ్యారు. అయితేఈ వేడుకకు తెలుగు టెలివిజన్, సినీ తారలు, ప్రముఖులు ఎవరూ లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పెళ్లికి హాజరు కాలేదు, అంతా ఫోన్ ద్వారా మరియు సోషల్ మీడియాలో మహేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.