Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానా ''అరణ్యం''లో బాలీవుడ్ నటి కల్కి కూచ్లిన్..

బాహుబలి భల్లాలదేవుడు రానా హిందీ సినిమా ''హాథీ మేరే సాథీ''. ఈ సినిమా హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు అరణ్య అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రానా సరసన హీరో

Advertiesment
రానా ''అరణ్యం''లో బాలీవుడ్ నటి కల్కి కూచ్లిన్..
, మంగళవారం, 5 జూన్ 2018 (13:25 IST)
బాహుబలి భల్లాలదేవుడు రానా హిందీ సినిమా ''హాథీ మేరే సాథీ''. ఈ సినిమా హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు అరణ్య అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రానా సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి కల్కి కూచ్లిన్ నటిస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 
 
ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని రానా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏనుగులతో హీరోకి గల స్నేహ సంబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.  తమిళంలో ఈ సినిమాకి ''కాదన్'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీపావళికి ఈ సినిమాను ఈ మూడు భాషల్లోను విడుదల చేయనున్నారు. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కాలా"కు సమస్యలుండవ్.. కర్ణాటకలో విడుదలఖాయం : రజినీకాంత్