కరోనా వైరస్ విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోను కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
అయితే తాజాగా తమిళ, కన్నడ, తెలుగు భాషాలలో ప్రముఖ హీరోయిన్‌గా రాణించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన నటి మాలా శ్రీ భర్త.. సినీ నిర్మాత కునిగల్ రాము (52) కరోనా కారణంగా మరణించారు.
వారం కింద కరోనా పాజిటివ్ రాగా.. బెంగుళూర్ నగరంలోని మత్తికెరెలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
తమకూరు జిల్లా కునిగల్ కు చెందిన రాము.. కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. వీరికి ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక రాము మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.