Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక కరోనా వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి అంటిస్తాడు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి, ఎవరు?

ఒక కరోనా వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి అంటిస్తాడు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి, ఎవరు?
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:01 IST)
కరోనావైరస్ పరిస్థితి దేశంలో తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే దేశంలో కరోనావైరస్ తీవ్రత వున్న రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఐతే వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.
 
అదేమిటంటే... ప్రజలు తమ ఇంట్లో వున్నా కూడా మాస్కులు వేసుకోవాలని చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తిపై అధికారులు సోమవారం నాడు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరంగా ఎవ్వరూ బయటకు రాకూడదు. అంతేకాదు ఎవరనీ ఇంటికి ఆహ్వానించవద్దు. కుటుంబ సభ్యుల మధ్య వున్నప్పటికీ అందరూ మాస్కులు వేసుకోవాలి అని నీతి ఆయోగ్ సభ్యులు వి.కె. పాల్ చెప్పారు.
 
ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించకపోతే కరోనా సోకిన వ్యక్తి నుంచి 30 రోజుల్లో 406 మందికి ఆ వైరస్ సోకే ప్రమాదం వుందని అధ్యయనాలు చెపుతున్నట్లు వారు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదనపు రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయం... అత్యధికశాతం ఉత్తరాదికే