ఎన్టీఆర్‌తోనే టీడీపీకి భవిష్యత్తు... ఆయనే అసలైన వారసుడు: వర్మ

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:33 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది. ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేని నటీనటులతో లీడ్స్ రోల్స్ చేయించి వర్మ పెద్ద ప్రయోగమే చేశారు. అయినా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఎన్టీఆర్‌గా విజయ్ కుమార్.. లక్ష్మీ పార్వతిగా యజ్ఞాశెట్టి.. నందమూరి బాలకృష్ణ వీజే బాలు తదితరులు నటించారు. 
 
ఈ నటులెవ్వరూ ఇండస్ట్రీకి పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న వర్మ... తాజాగా వర్మ సంచలన ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి భవిష్యత్తు అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 
సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా ఓటు వేయాలని కోరారు. టీడీపీకి నారా లోకేశ్ వారసుడు కానేకాదని, తారక్ మాత్రమే అసలైన వారసుడని పేర్కొన్నారు. అతడితోనే టీడీపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వెంకీ మామ ఎంతవ‌ర‌కు వ‌చ్చారు?