'బాహుబలి' తర్వాత 'రంగస్థల'మే...
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా, ఈ చిత్రం రూ.2000 కోట్ల కలెక్షన్లను అధికమించింది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా, ఈ చిత్రం రూ.2000 కోట్ల కలెక్షన్లను అధికమించింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఓ బుక్ రూపంలో రూపుదిద్దుకుంటోంది. ఇపుడు 'నాన్ బాహుబలి' మూవీగా పలు రికార్డులు సృష్టించిన "రంగస్థలం" చిత్రం త్వరలో ఓ బుక్ రూపంలో రాబోతుందని తాజా సమాచారం.
రాంచరణ్, సమంత, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్ల భారీ వసూళ్ళని సాధించి ఇంకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టిస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో రాంచరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత కనిపించి అలరించారు. నాన్ బాహుబలి మూవీగా పలు రికార్డులు సృష్టించిన 'రంగస్థలం' చిత్రం త్వరలో ఓ బుక్ రూపంలో రాబోతుందని తాజా సమాచారం.
ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇందులోని పాత్రలకి సంబంధించి ఓ బుక్ తయారు చేయాలని భావించాడట. ఇందుకు సంబంధించి సన్నాహలలో ఉన్నాడని టాక్. బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ 'రంగస్థలం' సినిమాకి సంబంధించి బుక్ రూపొందించడం గొప్ప విశేషమే అని చెప్పవచ్చు. 'రంగస్థలం' చిత్రం కోసం సుకుమార్ ఓ విలేజ్ సెట్ క్రియేట్ చేయగా, ఇప్పటికి ఇదీ చూపరులని ఎంతగానో అలరిస్తుంది.