Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Advertiesment
Ram Charan, Kiara Advani- Dope Song

డీవీ

, గురువారం, 19 డిశెంబరు 2024 (07:44 IST)
Ram Charan, Kiara Advani- Dope Song
రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా కియారా అద్వాణీ హీరోయిన్‌గా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశన్నంటిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా చిత్రం నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు
 
దిల్ రాజు బర్త్ డే సందర్భంగా గేమ్ చేంజర్ మూడో పాట ‘డోప్’ ప్రోమోను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోను చూస్తే ఈ పాటను ఏ రేంజ్‌లో శంకర్ పిక్చరైజేషన్ చేశారో అర్థం అవుతోంది. తమన్ ఇచ్చిన బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అత్యద్భుతంగా వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనిపిస్తోంది. ఈ పాటకు తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం సాహిత్యాన్ని అందించారు.
 
తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పూర్తి పాటను డల్లాస్‌ ఈవెంట్‌లో డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈ పాట డిసెంబర్ 22న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటల్ని అందించారు. తిరునవుక్కరసు కెమెరామెన్‌గా పని చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌