Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

Allu Aravind

డీవీ

, బుధవారం, 18 డిశెంబరు 2024 (19:54 IST)
సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ గారు మాట్లాడుతూ... ''అందరికి నమస్కారం.. ఇప్పుడే హస్పటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు.

గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో రికవరీ బాగా కనిపిస్తుంది. బట్‌ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వం కూడా మేము కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పడ అభినందనీయం. చాలామంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్‌ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఉదయమే అర్జున్‌ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు.
 
కానీ హస్పటల్‌ అధికారులు నిన్ననే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హస్పటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. కరెక్ట్‌ అనిపించింది. అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదు అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇక బన్నీ ఒక రోజు బాధపడుతూ నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి.. డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకున్నాను. ఈ రోజు వచ్చాను. ఈ  అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్‌ శాఖ వారికి, హాస్పిటల్‌ యజమాన్యానికి, సీఇవో అభిమన్యు, మెడికల్‌ డైరెక్టర్‌ సంహిత్‌కు అందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్