Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.500 కోట్ల క్లబ్‌లో రజనీకాంత్ "2.O"... తొలి తమిళ చిత్రంగా...

Advertiesment
రూ.500 కోట్ల క్లబ్‌లో రజనీకాంత్
, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:02 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "2.O". ఈ చిత్రం నవంబరు 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం విడుదలైన 8 రోజుల్లోనే(గురువారానికి) రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది. 
 
విజువల్‌ వండర్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమా కేవ‌లం హిందీలోనే రూ.వంద కోట్ల‌కిపైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. నాలుగు రోజుల‌లో 400 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఒక్క మన దేశంలోనే రూ.400 కోట్లకి పైగా వ‌సూళ్లు ఈ చిత్రానికి ద‌క్క‌గా విదేశాల‌లో రూ.121 కోట్లకి పైబ‌డే రాబ‌ట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 2.O రికార్డుపుటలకెక్కింది.
 
శుక్రవారం నాటికి ఈ చిత్రం కలెక్షన్లు రూ.600 కోట్లను క్రాస్ చేయొచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. దాదాపు రూ.550 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన "2.0" చిత్రం రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్ సాధించిన విషయం తెల్సిందే. చైనాలో వ‌చ్చే ఏడాది 56000కి పైగా స్క్రీన్స్‌లో ఈమూవీ విడుద‌ల కానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా అమీ జాక్స‌న్ నటించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలను సమకూర్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని అడిగితే తప్పులేదు కదా... సుబ్రహ్మణ్యపురం నటి ఈషా రెబ్బ(Video)