Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్ కందుకూరి ఆవిష్క‌రించి అం అః సాంగ్

Advertiesment
రాజ్ కందుకూరి ఆవిష్క‌రించి  అం అః  సాంగ్
, సోమవారం, 17 జనవరి 2022 (17:16 IST)
Am Aha team with Raj Kandukuri
కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాల్ రాకతో ఈ రంగుల ప్రపంచానికి కొత్త శోభ సంతరించుకుంటోంది. ఇదే బాటలో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు రంగంలోకి దిగుతోంది 'అం అః' మూవీ. డిఫరెంట్ టైటిల్, అంతకుమించి డిఫరెంట్ కథకు తెరరూపమిస్తూ డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
 
సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ 'అం అః' చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఈ మూవీ పోస్ట‌ర్ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రిలీజ్ చేయగా ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత రిలీజ్ చేసిన ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది.
 
మధు సురేష్ రాసిన లిరిక్స్‌పై ఇషాక్ వల్లి ఆలపించిన విధానం, సందీప్ కుమార్ కంగుల‌ అందించిన బాణీలు హైలైట్ అయ్యాయి. ప్రేమికుల మధ్య ఉండే సరదా మూమెంట్స్, బెస్ట్ మెమొరీస్‌ని సన్నివేశాలుగా మలిచి 'నీ మనసే నాదని' అందించిన ట్యూన్ యువత మనసు దోచేస్తోంది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యూత్ ఆడియన్స్ మెచ్చే స్టఫ్ బోలెడంత ఉందని ఈ సాంగ్ ప్రూవ్ చేస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ పాటను మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం.
 
నటీన‌టులు:
సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌రేశ్ అంటే నాకు జ‌ల‌సీ - జ‌గ‌ప‌తి బాబు