Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకులు, నిర్మాతలు తెలుసుకోవలసిన టెక్నాలజీ ఇది - సి. క‌ళ్యాణ్‌

దర్శకులు, నిర్మాతలు తెలుసుకోవలసిన టెక్నాలజీ ఇది - సి. క‌ళ్యాణ్‌
, సోమవారం, 10 జనవరి 2022 (08:46 IST)
C. Kalyan and expo team
హైదరాబాద్ లో కొంతకాలంగా ఎన్నో రకాల ఎక్స్ పోస్ గ్రాండ్ గా జరుగుతున్నాయి.  పాన్ ఇండియా మూవీస్ కారణంగా యావత్ భారతదేశం మనవైపు చూస్తోంది. ఇక్కడి సాంకేతికతను గురించి, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి ఆరా తీస్తోంది. అందుకే మనవాళ్ళు సైతం హాలీవుడ్ టెక్నాలజీని అర్థం చేసుకుని, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ను తెలుసుకుని, మరింత దూసుకుపోవాలని చూస్తున్నారు. ప్రపంచంలోని సాంకేతికతను తెలుగు సినిమా వారి ముందుకు తీసుకొచ్చే మహత్తర కార్యక్రమానికి 'ఫోటో టెక్' సంస్థ శ్రీకారం చుట్టింది. ఫోటో టెక్ సంస్థ భారీ స్థాయిలో 'హైదరాబాద్స్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో'ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన గ్రాండ్ పోస్టర్ లాంచ్ ఈ వేడుకా హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా .. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, హీరో శ్రీకాంత్, రాజ్ కందుకూరి, మామిడి హరికృష్ణ, దర్శకులు నీలకంఠ, చంద్ర సిద్దార్థ్, రసూల్ ఎల్లోర్, వి ఎన్ ఆదిత్య, వీర శంకర్, లక్ష్మి భూపాల్, కాశీ విశ్వనాధ్, ముకేశ్ రెడ్డి, అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోస్టర్ ని సి కళ్యాణ్, శ్రీకాంత్, కాశీ విశ్వనాధ్, రాజ్ కందుకూరి తదితరులు లాంచ్ చేసారు.
 
webdunia
Srikanth and expo team
ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. నిజంగా వీర శంకర్ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. చాలా గొప్ప పని చేస్తున్నాడు. నిజంగా దర్శకులే కాదు నిర్మాతలు కూడా తెలుసుకోవలసిన టెక్నాలజీ ఇది. గత పదిహేనేళ్లుగా ఎక్కడ ఫిలిం ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాళ్ళం. కానీ ఈ రోజు ఇలాంటి టెక్నాలజీ మనదగ్గరికి వచ్చింది. ఇలాంటి టెక్నాలజీని నిర్మాతలు అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే మంచి క్వాలిటీ సినిమా వస్తుంది. మరి దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారు అన్నది వీరశంకర్, అభిమన్యు రెడ్డి లమీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి ఏదైనా సహాయం కావాలంటే అందించేందుకు మేము సిద్ధం అన్నారు. 
 
దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ .. ఫోటో గ్రఫీ రంగంలోని సరికొత్త ఆవిష్కరణలను తన పాఠకులకు తెలియచేయడానికి ఈ సంస్థ 'ఫోటో టెక్' పేరుతో ఓ మాస పత్రికను కొన్నేళ్ళుగా నిర్వహిస్తోంది. అలానే ఈ రంగం అభివృద్ధి కోసం, ఇందులో పనిచేస్తున్న వారికి అప్ డేట్స్ ఇస్తూ, టెక్నాలజీని వారికి అందించడం కోసం ఎనిమిదేళ్ళుగా దేశవ్యాప్తంగా ఫోటో ఎక్స్ పోలను విజయవంతంగా నిర్వహిస్తోంది.  ఇవాళ మనం ఓ గ్లోబల్ విలేజ్ లో ఉన్నాం... ఎక్కడ ఏ మారు మూల ఎలాంటి సాంకేతిక ఆవిష్కరణ జరిగినా... దానిని వీలైనంత త్వరగా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలాంటి ఓ గొప్ప ఛాన్స్  టాలీవుడ్ కు అందచేయడం కోసం ఫోటో టెక్ సంస్థ భారీ స్థాయిలో 'హైదరాబాద్స్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో'ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన గ్రాండ్ పోస్టర్ లాంచ్ ఈ వేదికపై మరికొద్దిసేపట్లో జరుగబోతోంది.  ఈ కార్యక్రమ నిర్వహాకులు అడిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం తన సంసిద్థతను తెలియచేసింది. త్వరలో జరుగబోయే గ్రాండ్ ఎక్స్ ప్లో కు పూర్తి స్థాయిలో చేదోడు వాడోడుగా ఉంటామని హామీ ఇచ్చింది. అలాగే శ్రీకాంత్ గారికి, సి కళ్యాణ్ గారికి, మామిడి హరికృష్ణ గారికి కూడా ధన్యవాదాలు, ఈ సందర్బంగా  మంత్రి శ్రీ శ్రీనివాసగౌడ్ గారు పూర్తీ సహకారం అందిస్తానని అన్నారు. అలాగే తలసాని గారు కూడా ఫుల్ సపోర్ట్ అందిస్తామని అన్నారు. షార్ట్ ఫిలిం మేకర్స్ కు కూడా కాంటెస్ట్ పెట్టాం. కొత్త ఫిలిం మేకర్స్ ని  ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం అన్నారు.  ఈ సందర్గంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు. 
 
ప్రముఖ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ .. వీర శంకర్ నన్ను ఈ విషయం గురించి అడిగితె సరే అన్నాను. సినిమా టెక్నాలజీకి సంబందించిన విషయం కాబట్టి ఇండస్ట్రీ కి చాలా అవసరం కాబట్టి సరే అన్నాను. ఈ టెక్నాలజీ గురించి సినిమా వాళ్లందరికీ తెలియాలి. అలాగే ఇందులో నవరసం, వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలిం లకు అవార్డులు అందించే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాం అన్నారు. 
 
ఫోటో టెక్ అధినేత అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ ..  ఈ వేడుకకు వచ్చిన అతిదులందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫోటో టెక్ ముఖ్య ఉద్దేశం... ఫోటో గ్రాఫి లో కొత్త టెక్నాలజీ ని అందించాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అది రోజు రోజు కు ఎదుగుతూ ఈ రోజు సినిమా విషయంలో కొత్త టెక్నాలజీ ని ఎందుకు ఉపయోగించకూడదు అన్న ఆలోచనతో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నం. సినిమాకు సంబందించిన టెక్నాలజీ కోసం ముంబై వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మన హైదరాబాద్ లోనే అన్ని రకాల టెక్నాలజీ అందుబాటులో తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు అభినందనలు తెలియచేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాంప్ర‌దాయ లుక్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఎందుకు రాలేదు!