బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప టీమ్ పార్టీ
, శనివారం, 17 ఫిబ్రవరి 2024 (17:33 IST)
తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకున్నాక విజయోత్సవాలు విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అక్కడ ఆచారానికి తగినట్లు విందులు వినోదాలతో గడుతుపుంటారు. ఇటీవలే బెర్లిన్ వెళ్ళిన అల్లు అర్జున్ తన నిర్మాతలతోపాటు టెక్నికల్ టీమ్ తో కలిసి విందులో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తగ్గెదేలే.. అన్న మేనరిజాన్ని చూపిస్తూ సందడి చేశారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహకులు.
దీంతో పుష్ప ది రైజ్‌కు దక్కిన అరుదైన గౌరవంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందంలో వున్నారు. బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్ళారు. అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తర్వాతి కథనం