అజ్ఞాతవాసి ''కొడకా కోటేశ్వరరావు'' వైరల్.. ఆ స్టిల్ కూడా లీక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కోసం పాడిన ''కొడకా కోటేశ్వర్రావు'' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు పవన్ పాడిన ఈ పాటను సినీ యూనిట
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కోసం పాడిన ''కొడకా కోటేశ్వర్రావు'' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు పవన్ పాడిన ఈ పాటను సినీ యూనిట్ విడుదల చేసింది.
యూట్యూబ్‌లో విడుదలైన కాసేపటికే.. ఈ పాట వైరల్ అయ్యింది. మాస్ ఆడియన్స్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట రిలీజై 24 గంటలు గడవకముందే, యూట్యూబ్ లో 2.78 మిలియన్ల వ్యూస్‌ను.. 2.27 లక్షల లైక్స్‌ను రాబట్టింది.
అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా స్టిల్ కూడా వైరల్ అవుతోంది. ఇదో స్టైలీష్ ఫైట్ సీక్వెన్స్ అని అర్థమవుతోంది. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ ఫైట్ తాలుకూ ఛాయాచిత్రం లీక్ అయ్యింది. ఈ స్టిల్‌లో పవన్ మోకాలిపై కూర్చుని ధ్యానముద్రలో కనిపిస్తున్నట్లు వుంది.