Aam admi party nirasana at CM meeting
చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్రపురికాలనీ పోరాట సమితికి చెందిన మహిళలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కొందరు ఆందోళనకు దిగారు. చిత్రపురి కాలనీకి చెందిన దొంగలను సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దొంగలు వచ్చారంటూ నినదించారు.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	మహిళా పోలీసులు వారిని నియంత్రించే పనిలోకి దిగారు. సి.ఎం. డౌన్ డౌన్ అంటూ నినాదలు చేశారు. ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వందల కోట్లను తినేసిన తిమింగళం చిత్రపురి కాలనీకి చెందిన వల్లభనేని అనిల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. 
	 
	సినీ కార్మిలకు పేరిట డబ్బులు ఇచ్చి మరీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ సభకు తీసుకు వచ్చారనీ, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే దొంగలు. ప్రభుత్వం వచ్చాక చిత్రపురిలో అవినీతిని అరికడతాననీ, అనిల్ పై చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రులు కూడా అనిల్ తో మిలాఖత్ అయి దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. చిత్రపురి నాయకులైన దొంగలను కాపాడేందురే రేవంత్ రెడ్డి అనే దొంగ వచ్చాడంటూ మరింత పదునుగా మాట్లాడారు.