Producer Vishwaprasad, Chiranjeevi
ఇటీవలే భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి అక్కడ ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవలే పద్మవిభూషన్ అవార్డు పొందిన ఆయనకు సోషల్ మీడియాలో విదేశాలనుంచి మంచి స్పందనలు వచ్చాయి. వారిని కలిసుకుందుకు సమయం తీసుకుని మరీ వాలెంటైన్ డే నాడు పయనమయ్యారు. అక్కడ ప్రవాసాంధ్రుడు నిర్మాత విశ్వప్రసాద్ ను కలిశారు.
ఈ విషయాన్ని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ షేర్ చేస్తూ, చిరంజీవిగారిని కలుసుకున్నందుకు సంతోషం. లాస్ ఏంజెల్స్ చిరంజీవిగారిని సన్మాన కార్యక్రమం నిర్వహించడం కోసం వారి సమ్మతిని పొందడం జరిగిందని తెలిపారు. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. కాగా, చిరంజీవిగారితో సినిమా చేయాలనేది విశ్వప్రసాద్ కోరిక. ఈ సందర్భంగా ఆ చర్చలు కూడా జరనున్నాయి.
ఇక చిరంజీవి, వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ అమెరికా టూర్ నుంచి భారత్ వెళ్ళాక యథావిధిగా షూట్ లో పాల్గొననున్నారు.