Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ నిర్మాత కుమారుడి అనుమానాస్పద మృతి

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి (45) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా వాకాడు మండ‌లం పంబ‌లి

Advertiesment
Producer S Gopal Reddy
, మంగళవారం, 8 మే 2018 (14:01 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి (45) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా వాకాడు మండ‌లం పంబ‌లి ప్రాంతంలో భార్గ‌వ్‌కి రొయ్య‌ల హ్య‌చ‌రీ ఉంది. సోమ‌వారం రాత్రి 11 గంట‌ల‌కి స‌ముద్రం వ‌ద్ద‌కి వెళ్లిన ఆయ‌న తెల్లారి శ‌వ‌మై కనిపించాడు.
 
వాకాడు వ‌ద్ద స‌ముద్ర వద్ద ఆయ‌న మృత‌దేహం తీరానికి కోట్టుకురావ‌డంతో భార్గ‌వ్ మృతిపై ప‌లువురు అనుమానం వ్య‌క్తంచేస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు భార్గ‌వ్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతిపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 
 
భార్గ‌వ్ పేరు మీద భార్గ‌వ్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించిన ఎస్. గోపాల్... నందమూరి హీరో బాల‌కృష్ణతో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే. ఈయ‌న 2008లో మ‌ర‌ణించారు. అప్ప‌టినుంచి ఈ బేన‌ర్‌పై ఎలాంటి సినిమాలు తీయడం లేదు. 
 
కాగా, భార్గవ్ రెడ్డి మృతికి కారణమేంటో తెలియకపోయినప్పటికీ... కుక్కపిల్లను కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు స్థానిక సమాచారం. అయితే నిజంగా కుక్కపిల్లను కాపాడబోయి చనిపోయారా? లేదంటే మరేమైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఇది పూర్తైతే కొంత మేరకు ఆయన మరణానికి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన అభిమానులు కేవలం 11 వేలేనా? షాకయ్యా... వర్మ మళ్లీ ఏసేశాడు...