Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాల్ మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తారా? సిగ్గుచేటు: పద్మజ

దాచేపల్లి ఘటనపై ఏపీ పోలీసులు, సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే రోజా బరితెగించిన మహిళ అని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యే రో

Advertiesment
కాల్ మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తారా? సిగ్గుచేటు: పద్మజ
, సోమవారం, 7 మే 2018 (14:14 IST)
దాచేపల్లి ఘటనపై ఏపీ పోలీసులు, సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే రోజా బరితెగించిన మహిళ అని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు.


రోజా పట్టపగలు మద్యం తాగి ప్రెస్ మీట్స్ పెట్టి ఆమె ఇష్టానుసారం మాట్లాడుతుందని విమర్శించారు. ఇలా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెను టెస్టు చేస్తే ఆ విషయంలో తేలిపోతుందని ఎద్దేవా చేశారు. 
 
రోజాను  బురదలో దొర్లే పంది మాదిరిగా ఊరిమీదకు వైకాపా చీఫ్ జగన్ రెడ్డి వదిలేశారని.. రోజా జబర్దస్త్ షోలు, నీలి సినిమాలు ఇంటర్నెట్‌లో చూసి యువత పెడదోవ పడుతోందని బుద్ధా వెంకన్న అన్నారు.

ఇలా తీవ్రపదజాలంతో రోజాపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. రోజాను ఉద్దేశించి తెలుగుదేశం నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. 
 
కాల్ మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తున్నారని, మహిళలంటే టీడీపీ నేతలకు గౌరవం లేదని పద్మజ మండిపడ్డారు. టీడీపీ అసమర్థపాలనను ప్రశ్నిస్తున్న మహిళలపై ఎదురుదాడి చేయిస్తున్నారని విమర్శించారు.

ఓ దళిత మహిళను టీడీపీ ఎమ్మెల్యే వివస్త్రను చేయించినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థల్లో బాలికల ఆత్మహత్యలకు సంబంధించి మంత్రి నారాయణపై చర్యలు తీసుకోగలరా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రొఫెసర్ పంపిన అసభ్యకర ఫోటోలు... చితకబాదిన విద్యార్థినిలు (వీడియో)