Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో బరితెగించిన మహిళ ఆర్కే. రోజా : టీడీపీ ఎమ్మెల్యేల ధ్వజం

భారతదేశంలో బరితెగించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే ఆమె ఖచ్చితంగా ఆర్కే. రోజా అని టీడీపీ ఎమ్మెల్యేలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్‌గా చెలామణి అవుతున్న సినీ నటి రోజా...

Advertiesment
Bandaru Satyanarayana
, ఆదివారం, 6 మే 2018 (17:03 IST)
భారతదేశంలో బరితెగించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే ఆమె ఖచ్చితంగా ఆర్కే. రోజా అని టీడీపీ ఎమ్మెల్యేలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్‌గా చెలామణి అవుతున్న సినీ నటి రోజా... టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇందులోభాగంగా, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశంలోనే అత్యంత బరితెగించిన మహిళ వైసీపీ ఎమ్మెల్యే రోజా అని వ్యాఖ్యానించారు. తాను ఓ మహిళనని రోజాకు చెప్పుకునే అర్హతే లేదని వ్యాఖ్యానించిన బండారు, ఆమెకు సభ్యత, సంస్కారం లేవంటూ మండిపడ్డారు. 
 
రోజాకు ఏమాత్రం సంస్కారం ఉంటే.. తొలుత భాషను నేర్చుకోవాలని హితవు పలికారు. బజారు భాషను ఆమె మాట్లాడుతోందని, రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్న వారు కూడా ఆ విధంగా మాట్లాడరని కఠువుగా వ్యాఖ్యానించారు. తనను ఆరే, ఒరే అని రోజా సంబోధిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, తాను రోజాను ఓ సోదరి మాదిరే భావిస్తున్నానని, అయినా ఆమె తన నోటికొచ్చినట్టు మాట్లాడుతోందని నిప్పులు చెరిగారు.
 
అలాగే, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, అన్ని విషయాలపై స్పందించే ఎమ్మెల్యే రోజా ఆయేషా మీరా హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విజయవాడలో రోజా అడుగుపెడితే అడ్డుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ సంచరిస్తోందని, ఆ గ్యాంగ్ పట్టపగలు రోడ్లపై తిరిగి రాత్రికి దోచుకుపోతారని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్ల కోసం టిప్పు సుల్తాన్ జయంతిని జరుపుతారా : నరేంద్ర మోడీ ధ్వజం