Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థూ.. వైకాపా నేతలా పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడేది : నిర్మాత నట్టి కుమార్

natti kumar

ఠాగూర్

, ఆదివారం, 11 ఆగస్టు 2024 (15:06 IST)
గత వైకాపా ప్రభుత్వంలో గంట, అరగంట మంత్రులుగా పేరుగడించిన వైకాపా నేతల నుంచి ఇపుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వరకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన తీరు జుగుత్సాకరంగా ఉందని, ఇలాంటి వారా పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడేది అంటూ సినీ నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. ఆయన శనివారం హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ, వైకాపాలో కుటుంబ తగదాలు మొదలయ్యాయని చెప్పారు. ఆ పార్టీ అధినాయకుడితో పాటుఅనుచరులకు కూడా తగాదాలు తగులుకున్నాయన్నారు. 
 
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో మాధురి మాటలు నీచంగా ఉన్నాయనీ, జగన్ మరీ ఈ వ్యవహారంలో వారికి సపోర్ట్ చెస్తారెమో అనే సందేహం వ్యక్తం చేశారు. మాధురి సుప్రీం కోర్టు తీర్పు, రిలేషన్ అంటూ ఎదో మాట్లాడిందని, కానీ భార్య పిల్లలు ఉండగా, కుటుంబసభ్యులను ఇబ్బందపడేలా రిలేషన్ ఉండమని సుప్రీంకోర్టు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. గతంలో అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు వంటి వారు చేసిన వ్యవహారాలు చూశామని, ఇపుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బండారం బయటపడిందన్నారు. జగన్ దువ్వాడను పార్టీ నుంచి సస్సెండ్ చెస్తారా లేదా అని ప్రశ్నించారు. అవసరానికి వాడుకుని వదిలే రకం జగన్ అని విమర్శించారు. 
 
విశాఖలో ఎంఎల్సీ ఎన్నికలు నడుస్తున్నాయని, బోత్స వద్ద అక్రమసంపద ఉంది కాబట్టి సీట్ ఇచ్చారన్నారు. వైజాగ్‌కు అభివృద్ధి కావాలి.. అరాచకం వద్దన్నారు. వైజాగ్ వాసిగా చెప్తున్నా 700 ఓట్లకు పైగా కూటమి గెలుస్తుందన్నారు. పీలా గోవింద్‌కి కూటమి సీట్ ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి సీట్ ఇచ్చినా గెలుస్తారన్నారు. పవన్ కల్యాణ్ హీరోల పాత్రల గురించి మాట్లాడారని గుర్తుచేశారు. అటవీ శాఖ మంత్రిగా అడవి సంపద గురించి కాపాడాలనే విధంగా మాట్లాడారని తెలిపారు. ఆయన అల్లు అర్జున్ గురించి విమర్శలు చేయటానికి కాదన్నారు. సినిమాను సినిమాలాగానే చూడాలని హితవు పలికారు. 
 
తాను ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు చెప్పారు. తాను అడిగిన వెంటనే ఇచ్చేస్తారని కాదని, తనకున్న అనుభవంతో  సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలనేది తన అభిమతమన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో, తనకు సేవ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందని తన ఆకాంక్ష అని చెప్పారు. చిరంజీవి, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేశ్‌లకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. కానీ తనకు పదవీ ఇచ్చినా ఇవ్వకున్నా.. లోకేష్ వెంటే ఉంటానని తెలిపారు. ఎఫ్‌డిసి పదవి అర్హత ఉన్న, అవగాహన ఉన్న వారికే ఇవ్వాలని తన మనవి అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదిరిపోయిన ప్రిన్స్ మహేశ్ బాబు న్యూలుక్ (వీడియో)