Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రీ ప్లాన్డ్

Rajeev, G. Venkata Rajesh, Sripati Naidu and others
, సోమవారం, 20 జూన్ 2022 (18:04 IST)
Rajeev, G. Venkata Rajesh, Sripati Naidu and others
ఒక వ్యక్తి ఆలోచన దాని ప్రభావం మరో వ్యక్తి పై ఎలా చూపుతుంది అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం "ప్రీ ప్లాన్డ్".జి. వి. ఆర్ క్రియేటివ్ వర్క్స్  పతాకంపై యోగి కటిపల్లి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడులు సంయుక్తంగా  నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్. రాజ్ కమల్ గుంటుకు, వైష్ణవి సోనీ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24 న గ్రాండ్ గా విడుదలవుతుంది. తాజాగా హైదరాబాద్ సారధి స్టూడియోలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను  ప్రముఖ రచయిత త్యాగరాజు ,ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గార్లు ఘనంగా విడుదల చేశారు. 
 
అనంతరం  ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్  మాట్లాడుతూ.."ప్రీ ప్లాన్డ్" టైటిల్ తో పాటు ట్రైలర్ కూడా చాలా బాగుంది.ఈ చిత్ర నిర్మాతలు దర్శకుడు కొత్తవాడైనా కథపై ఉన్న నమ్మకంతో యోగి లాంటి కష్టపడే కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం హర్షించ దగ్గ విషయం.ఇలాంటి కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి రావడం వలన ట్యాలెంట్ ఉన్న అనేక మంది దర్శకులు వృద్ధిలోకి వస్తారు. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ముఖ్యం కాదు కథలో మంచి కంటెంట్ ఉంటే  ప్రేక్షకులే ఆ సినిమా ను పెద్ద సినిమాగా చేస్తారు. మేము ఇప్పటి వరకు 558 సినిమాలను ఓటిటి లో విడుదల చేశాము .ఇప్పుడు రిలీజ్ చేస్తున్న "ప్రీ ప్లాన్డ్" 559 సినిమా.ఈ నెల 24 న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
 
ప్రముఖ రచయిత త్యాగరాజు,  కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేసే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి రావాలి .ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది .హీరో, హీరోయిన్స్ కాకుండా ఇందులో వారంతా చాలా చక్కగా నటించారు.ఈ సినిమాలో సున్నితమైన బావాలు ప్రేక్షకులను కదిలించేలా చేశారని అన్నారు.
 
చిత్ర నిర్మాత రాజేష్ మాట్లాడుతూ.. దర్శకుడు యోగి ఈ సినిమా కోసం చాలా కడ్డాడు.తను రాసుకున్న కథ నచ్చి ఈ సినిమా చేశాను.దర్శకుడు కొత్త వాడైనా సినిమా బాగా తీశాడు.మేము అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా బాగా వచ్చింది.మా సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గారికి ధన్యవాదాలు. ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు 
 
చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ,  పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ తీసుకొని 12 షార్ట్ ఫిల్మ్ తీశాను. అయితే నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ ను రాజేష్ గారే ప్రొడ్యూస్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో సినిమా తియ్యాలని మంచి కథను రెడీ చేసుకొని చాలా మందికి చెప్పడం జరిగింది.నేను చేస్తున్న ప్రయత్నం, దర్శకుడు అవ్వాలానే నా తపన చూసి ఈ సినిమా కథ చెప్పామన్నారు. నేను చెప్పిన కథ నచ్చలేదు అన్నారు. నాకు ఈ కథపై ఉన్న నమ్మకంతో తక్కువ బడ్జెట్ లో నేనే సినిమా తీద్దామని ప్రిపేర్ అయిన టైం లో నిర్మాతలు జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడులు ఫోన్ ఈ సినిమా చేద్దాం అన్నారు. ఈ చిత్రానికి నటీ నటులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. లీలు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాను ఎంకరేజ్ చేస్తూ ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గారికి ధన్యవాదాలు.ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలి అన్నారు.
హీరో రాజ్ కమల్ గుంటుకు మాట్లాడుతూ..సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "ప్రీ ప్లాన్డ్ ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమైన "ప్రీ ప్లాన్డ్" లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏమైపోతానే చిత్రం