Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#PSPK28‌లో ప్రకాష్ రాజ్.. మరోసారి అదే ఎనర్జీని చూద్దాం?

#PSPK28‌లో ప్రకాష్ రాజ్.. మరోసారి అదే ఎనర్జీని చూద్దాం?
, సోమవారం, 28 జూన్ 2021 (19:25 IST)
Prakash Raj_Pawan
#PSPK28‌లో ప్రకాష్ రాజ్ నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తిండిపోయే పాత్రలు చేశారు. 'బద్రి', 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', 'వకీల్‌సాబ్‌' సినిమాల్లో పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయనడంతో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే తాజాగా మరోసారి పవన్‌తో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడట.
 
హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న #PSPK28 సినిమాలో ఆయన నటించబోతున్నారనే ప్రచారానికి.. ఈ దర్శకుడు షేర్ చేసిన ట్వీట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. తాజాగా హరీష్ శంకర్ 'బద్రి' సినిమా నుంచి పవన్‌ కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. 'మరోసారి అదే ఎనర్జీని చూద్దాం' అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి పవన్-ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ‌ర్వానంద్ ఒకే ఒక జీవితం ఫ‌స్ట్ లుక్