Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్న

Advertiesment
ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?
, శనివారం, 14 ఏప్రియల్ 2018 (10:47 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండ‌స్ట్రీ అంద‌రి త‌రుపున చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలియ‌చేయ‌డానికి వీళ్లు ఎవ‌రు? అంటూ త‌న‌దైనశైలిలో ప్ర‌శ్నిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
సినీ ప్ర‌ముఖులు రాఘ‌వేంద్ర‌రావు, అశ్వ‌నీద‌త్, కె.ఎల్.నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, కిర‌ణ్ త‌దిత‌రులు చంద్ర‌బాబు నాయుడు క‌లిసి మ‌ద్ద‌తు తెలియ‌చేసారు. ఈ వార్త‌ను ఓ వార్తా ప‌త్రిక‌లో చూసాన‌ని.. అది త‌ప్పు అయితే వాళ్లు ఖండించాలి.

నిజ‌మైతే... సినీ ప‌రిశ్ర‌మ త‌రుపున కాకుండా వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించాలి అన్నారు. న‌న్ను మ‌ద్ద‌తు గురించి అడ‌గ‌లేదు. కొంత మందిని అడ‌గ‌కుండా మొత్తం సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ఎలా చెబుతారు. ఇండ‌స్ట్రీ అంటే ఆ నలుగురైదుగురేనా..? అంటూ ప్ర‌శ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు భాష‌ల్లో 'రంగ‌స్థ‌లం' .. 13 రోజుల్లో రూ.175 కోట్ల గ్రాస్