Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

#Paruchuri GK‏ : నవంబర్ 13 జీవితంలో రాకూడదు...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కథా రచయితల్లో పరుచూరి బ్రదర్స్ ఒకరు. వీరిలో పరుచూరి గోపాలకృష్ణ ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ మంచి మాటను ట్వీట్ చేస్తుంటారు.

Advertiesment
Paruchuri Gopalakrishna
, మంగళవారం, 14 నవంబరు 2017 (11:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కథా రచయితల్లో పరుచూరి బ్రదర్స్ ఒకరు. వీరిలో పరుచూరి గోపాలకృష్ణ ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ మంచి మాటను ట్వీట్ చేస్తుంటారు. తాజాగా కృష్ణా నదిలో బోటు బోల్తా, హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో అగ్నిప్రమాదంపై స్పందించారు. ఆ మాటలు ఆయన మాటల్లోనే...
 
"అక్కడ కృష్ణమ్మలో జలసమాధి, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేనిగారి మనం జ్ఞాపకం అగ్నికి ఆహుతి, మనసుని కలచివేశాయి. ఇలాటి నవంబర్ 13 మన జీవితంలో రాకూడదు" అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, సత్యమైనా అసత్యమైనా పలుకుల ద్వారానే వస్తుంది! కానీ సత్యవచనం పలికేటప్పుడు ఉన్న శబ్ద స్పష్టత, అసత్యం పలికేటప్పుడు ఉండదు! చిన్న తడబాటు ఉంటుంది! గమనించి మసలు కోండి సన్నిహితులారా! అంటూ మరో ట్వీట్ చేశారు. 


 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం : నాగార్జున