Anil Gila, Varshini, Shiva Krishna Burra, Muralidhar, Sadanna, Vijaya Lakshmi, Sujatha, Madhura Sridhar
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా మోతెవరి లవ్ స్టోరీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన  సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు.
 
									
										
								
																	
	 
	అనిల్ గీలా మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ అందరికీ థాంక్స్. ఈ సిరీస్ చూస్తే మన ఇంట్లో జరిగే కథలానే అనిపిస్తుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ZEE5 టీంకు థాంక్స్. వీలైనంతగా మా సిరీస్‌ను అందరూ సపోర్ట్ చేయండి. మేం ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. మేం ఇలానే కష్టపడుతూనే ఉంటాం. ఇలానే ఆడియెన్స్ మా అందరినీ సపోర్ట్ చేయండి. మా సిరీస్ గురించి స్టాలిన్ చిత్రంలో చేప్పినట్టుగా ఓ ముగ్గురుకి చెబుతూ వెళ్లండి. ఇండియాలోనే ZEE5లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ZEE5ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. మా సిరీస్‌ను చూడండి అని అన్నారు.
 
									
											
									
			        							
								
																	
	 
	ZEE5 తెలుగు వైస్ ప్రెసిడెంట్, కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయి తేజ్ మాట్లాడుతూ .. అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీ వచ్చాడు.. ఇక ఓటీటీ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు వెళ్లాలి. తెలంగాణ నుంచి ఇంకా అనేక మంది కళాకారులు బయటకు రావాలి. గంగాధర్ లిరిక్స్, శ్రీకాంత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మా డైరెక్టర్ శివ ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. అనిల్, వర్షిణి ఇలా అందరూ అద్భుతంగా నటించారు. పైరసీలో సిరీస్‌లను చూడకండి. సబ్ స్క్రైబ్ చేసుకుని చూడండి. ప్రతీ నెలా మంచి సిరీస్‌లతో ఆడియెన్స్ ముందుకు రానుంది అని అన్నారు.
 
									
					
			        							
								
																	
	 
	నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ చాలా కష్టపడ్డారు. ఇది మన తెలంగాణ కథ అయినా అందరూ చూసేలా తెరకెక్కించాం. ఇక ముందు మా నుంచి ప్రపంచ స్థాయి కంటెంట్ వస్తుంది అని అన్నారు.
 
									
					
			        							
								
																	
	 
	దర్శకుడు శివ కృష్ణ బుర్రా మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీ మా నాన్నకి అంకితం చేస్తున్నాను. మావి గల్ఫ్ బతుకులు.. గల్ఫ్ మెతుకులు. ఇందులోని ఫ్లాష్ బ్యాక్‌లో క్యాసెట్ సీన్‌ను నా జీవితంలో చూశాను. నాకంటే మా నాన్నకే సినిమాలంటే ఎక్కువగా ఇష్టం. సిరీస్ కోసం మా టీం అంతా చాలా కష్టపడింది. శ్రీకాంత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోయి ఉంటే ఈ సిరీస్ ఇంత గొప్పగా వచ్చేది కాదు. అనిల్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడు. త్వరలో మరింత పెద్ద హీరో అవుతాడు. వర్షిణి, మాన్సీ అందరూ అద్భుతంగా నటించారు. ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు నేను ఎప్పుడూ దాసోహమని అన్నారు.
 
									
					
			        							
								
																	
	 
	హీరోయిన్ వర్షిణి మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీలో నాకు అవకాశం ఇచ్చిన శివ గారికి, మధుర శ్రీధర్ గారికి, ZEE5 టీంకు థాంక్స్. అనిల్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా అందరినీ శ్రీకాంత్ అద్భుతంగా చూపించారు అని అన్నారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీ కోసం టీం అంతా కలిసి కష్టపడ్డాం. ఎక్కడా కూడా మేం కాంప్రమైజ్ కాలేదు. ప్రతీ లోకేషన్‌ను అందంగానే చూపించానని అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన అనిల్, శివలకు థాంక్స్ అని అన్నారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీలో నాకు అవకాశం ఇచ్చిన శివన్నకి, అనిల్ అన్నకి థాంక్స్. అనిల్ అన్న అద్భుతంగా నటించాడు. ఏలదరియా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెరపై చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్ అని అన్నారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	నటి మాన్సీ మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీ విషయంలో మాకు ప్రకృతి ఎంతో సహకరించింది. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన శివన్నకి థాంక్స్. ఈ సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరి కష్టం వల్లే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చింది. వర్షిణి, అనిల్ అందరూ బాగా నటించారు అని అన్నారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	లిరిక్ రైటర్ గంగాధర్ మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీలో అద్భుతమైన పాటలు రాసే అవకాశం ఇచ్చిన శివన్నకి, అనిల్ అన్నకి థాంక్స్. చరణ్ అన్న అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఆ శివుడి అండదండలు ఉన్నందు వల్లే ఈ సిరీస్ ఇంత గొప్ప విజయాన్ని అందుకుంది అని అన్నారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	నటుడు మల్లారెడ్డి మాట్లాడుతూ .. చిన్న ఫోన్‌లతో స్టార్ట్ అయిన మై విలేజ్ షో ప్రయాణం ఇప్పుడు సిరీస్ వరకు వచ్చింది. డైరెక్టర్ శివ తీసిన తీరు చూస్తుంటే ఇది సిరీస్‌లా కాకుండా గొప్ప సినిమాగా అనిపించింది. అనిల్ ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం కష్టపడ్డాడు. శ్రీకాంత్ గారి విజువల్స్, ఫ్రేమ్స్ చూస్తుంటే అద్భుతమైన సినిమాలా అనిపించింది. నేను నాలుగు రోజులే షూటింగ్ చేసినా కూడా ఈ సిరీస్ గొప్ప విజయం సాధిస్తుందని అనిపించింది. చరణ్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ అందించారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్ అని అన్నారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	నటుడు సదన్న మాట్లాడుతూ .. మోతెవరి లవ్ స్టోరీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నర్సింగ్ యాదవ్ అలియాస్ పులి అనే పాత్రను ఇచ్చిన శివ గారికి థాంక్స్. నాకు నవ్వించడమే తెలుసు. కానీ ఇందులో నాతో ఓ కొత్త పాత్రను చేయించారు. అందుకు శివ గారికి థాంక్స్. శ్రీకాంత్ కెమెరా వర్క్ అద్భుతంగా వచ్చింది. అనిల్ చక్కగా నటించాడు. అనిల్ రియల్ లైఫ్‌లోనూ హీరో. ఆయన భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు మధుర శ్రీధర్, శ్రీకాంత్, ZEE5 టీంకు థాంక్స్ అని అన్నారు.