Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

Advertiesment
Motevari Love Story sucess poster

దేవీ

, మంగళవారం, 12 ఆగస్టు 2025 (20:08 IST)
Motevari Love Story sucess poster
గ్రామీణ కథలు, మూలాల్లోంచి ఎమోషన్స్ తీసుకుని ZEE5 సరి కొత్త సిరీస్‌లను అందిస్తోంది. తాజాగా ZEE5  గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతేవారి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే 2,00,000 మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది.
 
శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతేవారి లవ్ స్టోరీ’ని నిర్మించారు.
 
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘మోతేవారి లవ్ స్టోరీ’ ఆరెపల్లి గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊర్లోని పర్షి (అనిల్ గీలా) అనే యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. అతను సత్తయ్య (మురళీధర్ గౌడ్) కుమార్తె అనిత (వర్షిణి)తో ప్రేమలో పడతాడు. కానీ సత్తయ్య, అతని సోదరుడు నర్సింగ్ (సదన్న) తమ దివంగత తండ్రి రాసిన ఓ వీలునామాను బయటపడటం, దీంతో ఓ భూ వివాదం చెలరేగడం.. ఇక దీంతో హాస్యం, భావోద్వేగాలు పుట్టుకు రావడం, చివరకు ఊహించని మలుపులకు దారి తీయడం జరుగుతుంది.
 
విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ZEE5 లోని ట్రెండింగ్ చార్టులలో ఈ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. కొద్ది కాలంలోనే ‘మోతేవారి లవ్ స్టోరీ’ తెలుగు రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది.
 
శ్రీకాంత్ అరుపుల తన సినిమాటోగ్రఫీతో విజువల్స్‌కు ప్రాణం పోశారు. సుందరమైన గ్రామీణ ప్రకృతి దృశ్యాలను అందంగా చూపించారు. చరణ్ అర్జున్ తన అద్భుతమైన పాటలు, ఉత్తేజకరమైన నేపథ్య సంగీతంతో సిరీస్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లారు. ఎడిటింగ్ అనిల్ గీలా నిర్వహించగా.. శ్రీరామ్ ప్రశాంత్, అనిల్ గీలా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా పనిచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే