Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

Advertiesment
Motevari Love Story team with Madhura Sridhar

దేవీ

, గురువారం, 7 ఆగస్టు 2025 (17:47 IST)
Motevari Love Story team with Madhura Sridhar
స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్‌ రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. 
 
ఈ క్రమంలో మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ టీం చాలా కష్టపడింది. ఇలాంటి కథలను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి ZEE5 టీం చాలా కష్టపడుతోంది. అనిల్, వర్షిణి అద్భుతంగా నటించారు. శివ ఇప్పటికీ సిరీస్‌ కోసం పని చేస్తూనే ఉన్నారు. సదన్నకు నేను పెద్ద అభిమానిని. చరణ్ అర్జున్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. మా జర్నీని ఒకేసారి ప్రారంభించాం. స్నేహగీతం చిత్రంలో ఆయన ఓ పాట రాశారు. ఇందులో మంచి మ్యూజిక్, పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. శ్రీకాంత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
 
అనిల్ గీలా మాట్లాడుతూ, మేం కన్న కలకు అందరం ఆయుధంగానే పని చేశాం. శివన్న ప్రతీ చిన్న డీటైల్‌ను మిస్ కాకుండా చూసుకునేవారు. మా అందరికీ ఇది మొదటి ప్రాజెక్ట్. మా శివన్నతో సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తాం. మా ‘మై విలేజ్ షో’ టీంను మరింత ముందుకి తీసుకెళ్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సకుటుంబ సమేతంగా అందరూ కూర్చుని హాయిగా చూసుకునేలా మా సిరీస్ ఉంటుంది అని అన్నారు.
 
చరణ్ అర్జున్ మాట్లాడుతూ, శ్రీధర్ గారు నాకు మెంటర్‌లాంటి వారు. స్టైల్ చిత్రంలో మెరుపై సాగరా అనే పాటను రాశాను. ఆ పాట బయటకు రాయడానికి మధుర శ్రీధర్ గారే కారణం. ఆ పాటను ఆయనెంతో మెచ్చుకున్నారు. ఆయన మట్టి కళకారుల్ని బయటకు తీసుకు వస్తుంటారు.  శ్రీకాంత్ విజువల్స్, నా పాటకు సెట్ అయింది అన్నారు.
 
శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ .. ‘పగలు రాత్రి తేడా లేకుండా ఈ సిరీస్‌ కోసం అందరం పని చేశాం. అనిల్, శివ, నేను గత వారం నుంచి నిద్ర కూడా పోవడం లేదు. ఈ స్టోరీతో మేమంతా కనెక్ట్ అయిపోయాం. ఎలాగైనా సరే విజయం సాధించాలని కసితో పని చేశాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్ గారికి, ZEE5 టీంకు థాంక్స్. మా సిరీస్‌ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చరణ్ అర్జున్ అన్న ఇచ్చిన పాటలు, ఆర్ఆర్‌కు కంటతడి వచ్చేసింది. మా అనిల్ ఇంకా పెద్ద హీరో అవుతాడు’ అని అన్నారు.
 
జీ కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయి తేజ్ మాట్లాడుతూ .. ‘ప్రతీ ఊర్లో ఓ మోతెవరి ఉంటాడు. మారుమూల గ్రామాలకు సంబంధించిన కథలు చెప్పాలని అనుకున్నాం. తెలంగాణకు సంబంధించి రూటెడ్‌ కథ చెప్పాలని అనుకున్నప్పుడు అనిల్ గీలా గుర్తుకు వచ్చారు. అనిల్, శివ చెప్పిన కథ చాలా కనెక్ట్ అయింది. ప్రతీ నెలా ఇలాంటి కొత్త కథలతోనే మా ZEE5 టీం రాబోతోంది. శివ అద్భుతంగా సిరీస్‌ను రూపొందించారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ చాలా గొప్పగా ఉంది. శ్రీధర్ గారు మా వెన్నంటే ఉండి నడిపించారు. అందరూ ZEE5 సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సిరీస్‌ను చూడండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ