Gali Kiriti Reddy, Junior
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. గత వారం విడుదలైన ఈ సినిమా కన్నడలో మామూలుగా ఆడుతోంది. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇందుకు సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడంతోపాటు బోరింగ్ సన్నివేశాలతో నిండిపోయింది. అక్క, తమ్ముడు సెంటిమెంట్ కథతో రూపొందిన ఈ చిత్రానికి అంతకు ముందు వారమే వచ్చి నితిన్ తమ్ముడు సినిమా కూడా అలాంటి సెంటిమెంట్ రావడం కూడా మైనస్ అయింది.
కాగా, ఈ సినిమాలో కిరిటీ యాక్షన్ సన్నివేశాలు బాగానే చేశాడు. అనుభవంగల సాంకేతిక సిబ్బంది ఈ సినిమాకు పనిచేశారు. తాజాగా సోషల్ మీడియాలో షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన షాట్స్ పోస్ట్ చేశారు. అందులో కారుపైకి దూకే సన్నివేశం సినిమాలో భాగుంది. అదే షాట్ వర్కింగ్ వీడియోలో కారుపై పడిపోతాడు. ఇలాంటి షాట్స్ పెట్టి తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఇంకా ఈ సినిమాకు రెండు రోజులే గడువుంది. ఇప్పటివరకు పెద్దగా రాబడి వచ్చిందిలేదు. రెండు రోజుల్లో హరిహరవీరమల్లు సినిమా విడుదల కావడంతో దాదాపు థియేటర్లన్నీ బుక్ అయ్యాయి. ఇప్పటికే ఎ.పి.లో మంచి బుకింగ్స్ జరిగాయి. నైజాంలో ఇంకా స్లోగా నడుస్తున్నాయి. ఓవర్ సీస్ లో హరిహరవీరమల్లు బుకింగ్ బాగున్నాయి.