Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నితిన్ భీష్మగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముహుర్తం ఖ‌రారు...

Advertiesment
నితిన్ భీష్మగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముహుర్తం ఖ‌రారు...
, గురువారం, 29 ఆగస్టు 2019 (20:38 IST)
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాల్లో ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో ప్రారంభమైన భీష్మ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తొలి సినిమా ఛలోలో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ, ఈ సినిమాలో నితిన్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం.
 
నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా, పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ఆకట్టుకునే కథ, కథనాలతో, మంచి ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే క్రిస్మస్ కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటన రిలీజ్ చేసింది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూళ్లూరుపేటలో అతిపెద్ద తెరను ప్రారంభించిన చెర్రీ