Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీ ఖైదీ విడుద‌ల తేదీ కన్ఫర్మ్

Advertiesment
కార్తీ ఖైదీ విడుద‌ల తేదీ కన్ఫర్మ్
, సోమవారం, 26 ఆగస్టు 2019 (22:05 IST)
తమిళ నటుడు కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఖైదీ అనే సినిమా రూపొందుతోంది. ఫస్ట్ టైం లారీ డ్రైవర్‌గా పక్కా మాస్ పాత్రలో కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 
 
‘పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుండగా చేతికి ఉన్న సంకెళ్లతోనే తప్పించుకొని ఓ లారీతో సహా కార్తీ తప్పించుకు పారిపోవడం, దీంతో పోలీసులు అతడి కోసం వెతుకుతుండడం జరుగుతుంది. మరోవైపు ఒక రౌడీ బ్యాచ్ కూడా కార్తి కోసం వెతుకుతుంటారు. అతడిని చంపితే జీవితాంతం సరిపడా డబ్బులిస్తామని చెబుతారు. 
 
దీంతో ఓ వైపు పోలీసులు, మరోవైపు రౌడీలు వెతుకుతుండం, చివరకు ఏమైందనేదే సినిమా కథ అనేది మనకు టీజర్‌ని బట్టి కొంత అర్ధం అవుతుంది.
 
 అయితే ఈ సినిమా మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుందని అంటున్నారు. ఇక టీజర్ లో వచ్చే నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా ఉండడం, అలానే టీజర్ చివ‌ర్లో చికెన్ తింటూ కార్తి కనబరచిన నటన ఎంతో బాగుంటుంది. 
 
ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో థ్రిల్ కలిగించిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. డ్రీం వారియర్ పిక్చర్స్, వివేక్ ఆనంద పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు సీఎస్ సామ్ సంగీతాన్ని అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ కెమెరా మ్యాన్‌గా పనిచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య్ 64వ సినిమా సెట్ అయ్యింది... ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు..?