Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యూజిక్ నేపథ్యంలో ఈ తరం చిత్రంగా నీదారే నీ కథ రాబోతుంది

Vamsi, Shailaja Jonnalagadda and others

డీవీ

, బుధవారం, 20 మార్చి 2024 (17:34 IST)
Vamsi, Shailaja Jonnalagadda and others
జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా నీ దారే నీ కథ టీజర్ లాంచ్ ఈవెంట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా జరిగింది. మొత్తం కొత్త టీం తో ఈ ఈవెంట్ ని ఇన్నోవేటివ్ గా కొత్తగా చేశారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.
 
నిర్మాత తేజేష్ మాట్లాడుతూ : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీ మీడియానే మాకు పెద్ద సపోర్ట్ అన్నారు. 
 
నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ : సినిమా మీద ఉన్న  ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించాం. మంచి టెక్నికల్ వాల్యూస్ తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. బుడాపెస్ట్ లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్ నుంచి అలెగ్జాండర్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా గతంలో మిషన్ ఇంపాజిబుల్, పరసైట్, స్క్విడ్ గేమ్ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం అదేవిధంగా బాలీవుడ్ కి సంబంధించిన మ్యూజిషియన్స్ తో చాలా గ్రాండ్ గా చేసాం అన్నారు.
 
నిర్మాత, దర్శకుడు వంశీ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : నేను న్యూయార్క్ లో డైరెక్షన్ గురించి చదువుకొని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఎంతోమంది సింక్ సౌండ్ రిస్క్ అంటున్న సింక్ సౌండ్ తోనే ఎగ్జిక్యూట్ చేసి హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా చేయడమైనది. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మ్యూజిక్ డిజైన్ చేయించాం. మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓం భీమ్ బుష్ లాంటి పాయింట్ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదు : హీరో శ్రీవిష్ణు