Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యం క్షీణిస్తుంది.. శిక్షను నిలిపివేయండి : ఆశారాం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

asaram bapu

ఠాగూర్

, శుక్రవారం, 1 మార్చి 2024 (16:57 IST)
బాలిక అత్యాచారం కేసులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా శిక్షను నిలిపివేయాలని కోరుతూ అతడు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. పైగా, అర్థాంతరంగా శిక్షను ఎలా నిలిపివేస్తారంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. 
 
ఆశారాం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మహారాష్ట్రలో పోలీసు కస్టడీలో చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని అతడి తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి ధర్మాసం స్పందిస్తూ.. ఈ విషయంపైనా రాజస్థాన్‌ హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. దీనిపై విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది.
 
జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాంను 2013లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసు కస్టడీలో ఉండగా.. 2018లో పోక్సో కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. సూరత్‌లోని ఆశ్రమంలో మరో మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులోనూ అతడికి యావజ్జీవ శిక్ష పడింది. గతంలో ఆశారాం బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది : నితిన్ గడ్కరీ