Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయన వసంత కాలం వచ్చేస్తోంది..

Advertiesment
నయన వసంత కాలం వచ్చేస్తోంది..
, మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:13 IST)
లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌ను తెలుగులో వసంత కాలం పేరుతో తెలుగులోకి రానుంది. ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ కీలక పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి 'బిల్లా-2' ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు. 
 
లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్‌ను 'వసంత కాలం' పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. 
 
5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు 'ఏకవీర, వెంటాడు-వేటాడు" వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. "టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగి, ఇటు మెగాస్టార్ చిరంజీవితో 'సైరా'లో మెప్పించింది. 
 
అటు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో 'దర్బార్'లో జతకడుతున్న నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం 'వసంతకాలం'ను నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'వసంతకాలం' ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటోంది. నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోపై చెమట కంపు.. విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుల్ ప్రీత్ సింగ్