నేను అరుళ్‌ సరసన నటించట్లేదు.. హన్సిక

బుధవారం, 2 అక్టోబరు 2019 (15:52 IST)
శరవణా స్టోర్స్ అధిపతి అరుళ్  హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సినీ నటి హన్సికా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే శరవణా స్టోర్స్‌కి సంబంధించిన యాడ్స్‌లో అరుళ్ స్వయంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల తమన్నా, హన్సికతో కలిసి రూపొందించిన ఓ యాడ్‌లోనూ అరుళ్ దర్శనమిచ్చాడు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా అరుళ్‌పై గతంలోనూ పలు విమర్శలు వచ్చినా...అతను ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
అయితే అరుళ్ హీరోగా తెరకెక్కనున్న ఓ కొత్త సినిమాలో తాను జోడిగా నటించనున్నట్లు వెలువడిన కథనాలపై సినీ నటి హన్సికా మోట్వానీ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు పూర్తయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినికిడి.

ఈ నేపథ్యంలో అరుళ్ సరసన నటించేందుకు హన్సిక మోత్వానీ ఆమోదం తెలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన హన్సిన...తాను అరుణ్ సరసన నటించనున్నట్లు మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టంచేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ''సైరా''లో నయనతార నటన అదుర్స్.. చిరంజీవి, తమన్నా యాక్టింగ్‌కు జనాలు ఫిదా..