వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌కి వెళ్లే వీధిలో నటుడు నానా పటేకర్ కాస్త దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం జర్నీ షూటింగ్ చేస్తుండగా.. ఒక బాలుడు నానా వెనుక నుండి వచ్చి అతనితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నానా అతని తలపై కొట్టిన వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అంతేగాకుండా నానా పక్కన నిలబడి ఉన్న సిబ్బంది అబ్బాయి మెడ పట్టుకుని సెట్ నుండి బయటకు వెళ్లేలా చేస్తాడు. అభిమానిని కొట్టిన ఘటనను సోషల్ మీడియాలో పలువురు ఖండించారు. సామాన్యుడి పట్ల ఇలాంటి ప్రవర్తించడం దురదృష్టకరమని, మన రియల్ హీరోలు సినిమా తెరపై కాకుండా సరిహద్దులో ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.