ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలు దుంప చెంచిరెడ్డి భర్త దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ మండల అధ్యక్షుడు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు దుంప చెంచిరెడ్డి మంగళవారం దాడి చేశారు.
లక్ష్మీనారాయణరెడ్డి కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. విధుల్లో చేరినప్పటి నుంచి కార్యాలయంలో వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెల రోజుల క్రితం వైసీపీ నేత చెంచిరెడ్డి తనపై దౌర్జన్యం చేయడంతో రెండు వారాల పాటు సెలవుపై వెళ్లారు.
వివిధ పనుల ఒత్తిడి పెరగడంతో తహసీల్దార్ వ్యక్తిగత కారణాలతో ఆగస్టు 18న సెలవుపై వెళ్లారు. సెప్టెంబర్ 11న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో చెంచిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఎందుకు పని చేయడం లేదని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగాడు.
నిబంధనలు పాటిస్తున్నామని తహసీల్దార్ చెప్పడంతో చెంచిరెడ్డి మండిపడ్డారు. తహసీల్దార్ గొంతు పట్టుకుని చెంపపై కొట్టాడు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.