Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెర్రరిస్ట్ చెంప ఛెళ్లుమనిపించిన భక్తుడు.. వీడియో వైరల్... ట్విస్ట్ ఏంటంటే...

Advertiesment
terrorist mock drill
, బుధవారం, 9 ఆగస్టు 2023 (12:38 IST)
ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు సాయుధ తీవ్రవాది చెంప పగులగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తాను కొట్టిన వ్యక్తి తీవ్రవాది కాదని తెలుసుకుని ఆ భక్తుడు అవాక్కయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని స్వామి నారాయణ ఆలయంలో ఉన్నఫళంగా ఓ తీవ్రవాది ప్రవేశించాడు. దీంతో అప్పటివరకు ప్రశాతంంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయానకరంగా మారిపోయింది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణభయంతో వణికిపోయారు. ఇదంతా చూసిన ఓ భక్తుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. టెర్రరిస్ట్ చేతిలో తుపాకీ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా వెళ్లి నేరుగా చెంప ఛెళ్లుమనిపించాడు. దీంతో సదరు తీవ్రవాది ఖంగుతిన్నాడు. 
 
చివరుకు ఇదంతా పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ అని తేలడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకుని, సాటి భక్తుడు చేసిన పనికి పగలబడి నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన సిటీలోని ప్రసిద్ధి స్వామి నారాయణ్ ఆలయంలో జరిగింది. టెర్రర్ దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తారనే విషయం తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్ బుక్ లవ్‌లో నయా ట్విస్ట్ : అంజూ వీసా గడువు పొడిగించిన శత్రుదేశం