Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళయిన తరువాత కూడా తరగని అందంతో బొద్దుగుమ్మ (Video)

Advertiesment
Namitha
అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించింది. తమిళంలో అయితే ఆమె చేసిన సినిమాలు మంచి రెస్పాన్స్ రావడమే కాదు అభిమానుల్లో చిరస్మరణీయంగా నిలబడేలా చేసింది. 
 
అందుకే ఆమె కోసం గుడి కూడా కట్టేశారు అభిమానలు. మొదట్లో నమిత తెలుగులో సొంతం చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించింది.  ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారి బొద్దుగుమ్మగా పేరు తెచ్చుకుంది.  
 
బొద్దుగా మారినా నమిత క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ తరువాత తిరుపతిలో పెళ్ళి చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా ఆమె మాత్రం తన అందాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తోందట.
 
తాజాగా నమిత తన అందాలను ఆరబోస్తూ తీసిన చిత్రాలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు కాస్త వైరల్‌గా మారుతున్నాయి. అభిమానులను ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి. నా అభిమానుల కోసం ఈ ఫోటోలు అంటూ కింద టాగ్ కూడా చేసిందట నమిత. దీంతో నమిత ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు మెసేజ్‌లతో హోరెత్తిస్తున్నారట. మరి చూడాలి అభిమానుల కోరికతో మళ్ళీ నమిత సినిమాల్లో నటిస్తారా.. లేకుంటే ఫోటోలకే పరిమితం చేసుకుంటారా అన్నది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున 'వైల్డ్ డాగ్'లో సయామీ ఖేర్ (video)