నాగ్‌కి హ్యాండ్ ఇచ్చిన చైతూ... ఇంత‌కీ ఏం చేసాడు..?

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:14 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయ‌న ఒక‌టి. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల‌కు పైగా షేర్ సాధించి నాగార్జున కెరీర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా నిలిచి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రానికి సీక్వెల్ చేయాలి అనుకున్నారు.
 
బంగార్రాజు అనే టైటిల్‌ని ఎప్పుడో రిజిష్ట‌ర్ చేసారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈపాటికే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లాలి కానీ... నాగార్జున క‌థపై ఇంకా క‌స‌ర‌త్తులు చేయాలి అంటూ మార్పులు చెబుతూనే ఉన్నాడు. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య కూడా న‌టించ‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌, నాగ చైత‌న్య కూడా చెప్ప‌డం జ‌రిగింది.
 
తాజా వార్త ఏంటంటే... నాగ చైత‌న్య ప్ర‌స్తుతం వెంకీ మామ‌, శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు చేస్తున్నాను. ఆ త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయాలి. బిజీగా ఉన్న కార‌ణంగా బంగార్రాజులో న‌టించ‌లేను అని చెప్పేసాడ‌ట‌. ఈ విధంగా నాగ్‌కి నాగ చైత‌న్య హ్యాండ్ ఇచ్చాడు అని ఫిల్మ్ న‌గ‌ర్‌లో టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఇది నిజ‌మో కాదో తెలియాల్సివుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అల‌.. వైకుంఠ‌పుర‌ములో.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌