Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్ - వర్మ "కంపెనీ" షూటింగ్ వీడియో

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో కంపెనీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ

Advertiesment
నాగ్ - వర్మ
, మంగళవారం, 21 నవంబరు 2017 (12:10 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో కంపెనీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. 
 
నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 17 యేళ్ల క్రితం (1990 డిసెంబర్ 7వ తేదీ) వచ్చిన చిత్రం "శివ". ఈ చిత్రం టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులన్నీ తిరగరాసింది. ఇపుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయనుంది. 
 
ఇపుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది. శివ సినిమా కాన్సెప్ట్‌తో చుట్టూ గొలుసుతో వేసిన సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగార్జున సీరియస్ లుక్‌తో ఓ చేతిలో గన్, మరో చేతిలో సగం చింపేయబడి ఉన్న 100 నోటు పట్టుకుని ఉన్న పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచేస్తున్నాయి. 
 
"నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా.. తక్కువ నొప్పితో చస్తావ్. చూజ్" అంటూ నాగ్ సినిమాలోని డైలాగ్ చెబుతూ సందడి చేశాడు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఓసారి చూడండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... తాప్సీ నిన్నలా చూడలేక చస్తున్నాం... నీ రోగం కుదర్చడానికే అలా పెట్టా, తాప్సీ