సింగర్ రాహుల్ సిప్లిగంజ్ 'కొత్త ఆరంభం' అంటున్నారు. ఆయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజాగా హరిణ్యా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫోటోలను కొత్త ఆరంభం పేరుతో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీడీపీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె హరిణ్యా రెడ్డితో రాహుల్ నిశ్చితార్థఁ జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కోహినూర్‍లో ఈ వేడుక జరిగింది. ఈ వేడుక ఫోటోలను కూడా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సైతం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌కు కోటి రూపాయల నగదు బహుమతిని అందించిన విషయం తెల్సిందే. ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకూ వెళ్లిన కుర్రాడంటూ రాహుల్‌ను గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కొనియాడారు.
'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మాలే ఉన్నదిరా పోరి' వంటి సినిమా పాటలతో పాటలతో పాటు వినియక చవితి పాటలతో ఆలరించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలో మరో గాయకుడు కాలభైరవతో కలిసి రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెల్సిందే.