Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 1 జులై 2025 (20:53 IST)
శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో (ఎస్ఎల్సిబి), జూలై 1, 2025న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో మైస్ (MICE) రోడ్‌షో, పాత్రికేయుల సమావేశంను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం శ్రీలంక తనను తాను ప్రధాన మైస్(సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా నిలబెట్టుకునే వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగు.
 
ఈ రోడ్‌షోలో కీలకమైన భారతీయ మైస్ ప్లానర్లు, కార్పొరేట్ ట్రావెల్ నిపుణులు, ట్రావెల్ ట్రేడ్ పార్టనర్‌లు పాల్గొన్నారు. ఎస్ఎల్సిబి అధికారులు, 20 డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీలు(విశ్రాంతి మరియు మైస్ -కేంద్రీకృతమైనవి), ప్రముఖ హోటళ్లు & రిసార్ట్‌లు, టూర్ ఆపరేటర్లు, ఇతర సేవా ప్రదాతతో సహా శ్రీలంక నుండి బలమైన ప్రతినిధి బృందం కూడా పాల్గొంది. 
 
ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం శ్రీలంక, భారతదేశం మధ్య ఉన్న బంధాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చెందుతున్న పర్యాటక, మైస్  రంగాలలో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను పెంపొందించడం. శ్రీలంకకు పెరుగుతున్న భారతీయ పర్యాటకుల రాకపోకలు ఇక్కడ మొత్తం పర్యాటకుల పెరుగుదలకు ప్రధాన కారణం, జనవరి మరియు మే 31, 2025 మధ్య 204,060 మంది భారతీయ సందర్శకులు శ్రీలంకకు విచ్చేసారు.  ఇది శ్రీలంక పర్యాటక రంగానికి కీలకమైన మార్కెట్‌గా భారతదేశపు పాత్రను వెల్లడిస్తుంది.
 
భారతదేశంలో శ్రీలంకకు బలమైన, శాశ్వత బ్రాండ్ ఉనికిని నెలకొల్పడం, ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం ఈ రోడ్‌షో లక్ష్యం. శ్రీలంక యొక్క విభిన్న పర్యాటక ఆఫర్లు, విభిన్న ఆకర్షణలు, దాని మైస్ మౌలిక సదుపాయాలలో పురోగతులను ప్రదర్శించడం ద్వారా, ఈ కార్యక్రమం మైస్ కార్యకలాపాలకు గమ్యస్థానంగా శ్రీలంక అత్యుత్తమ స్థానం అని చెప్పడానికి ప్రయత్నించింది. ఈ వ్యూహాత్మక రోడ్‌షో శ్రీలంక యొక్క విస్తృత ప్రచార ప్రయత్నాలతో సమలేఖనం చేయబడింది. 
 
చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషన్లో యాక్టింగ్ డిప్యూటీ హైకమిషనర్ శ్రీమతి హర్ష రూపరత్నే మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు ఉత్తేజకరమైన, వైవిధ్యమైన హాలిడే గమ్యస్థానంగా శ్రీలంకను గుర్తించారు. ఇప్పుడు ఇది సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలకు ఎక్కువ మంది కోరుకునే వేదికగా మారింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో పయనిస్తున్నందున, ఉమ్మడి వెంచర్లు, పెరిగిన ఎగుమతులు, పర్యాటకం ద్వారా లోతైన ఆర్థిక సంబంధాల ద్వారా భారతదేశం యొక్క వృద్ధి కథలో కలిసిపోవడం ద్వారా శ్రీలంక అపారమైన ప్రయోజనం పొందుతుంది. అందువల్ల, శ్రీలంకను సందర్శించటానికి మేము భారత ప్రయాణికులను స్వాగతిస్తున్నాము” అని అన్నారు. 
 
శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో ఛైర్మన్ శ్రీధీర హెట్టియారాచ్చి మాట్లాడుతూ, “శ్రీలంక దాని సామీప్యత, బలమైన కనెక్టివిటీ కారణంగా ఒక అద్భుతమైన మైస్ గమ్యస్థానంగా నిలుస్తుంది. ఇది సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు మరియు ప్రదర్శనలకు అతి తక్కువ ఖర్చులో ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ రోడ్‌షోలు శ్రీలంక వృద్ధిని ప్రదర్శిస్తాయి, భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. శ్రీలంక మైస్ రంగానికి అత్యంత ప్రాధాన్యత మార్కెట్‌గా భారతదేశం కొనసాగుతోంది. ఈ తరహా కార్యక్రమాలు భారత ట్రావెల్ లీడర్ల తో  అర్థవంతమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి మాకు అనుమతిస్తాయి” అని అన్నారు. 
 
శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ వద్ద బంగ్లాదేశ్-నేపాల్‌, ఇండియా రీజినల్ మేనేజర్ ఫవ్జాన్ ఫరీద్ మాట్లాడుతూ “భారతదేశం నుండి మైస్ తరలింపు అనేది అవుట్‌బౌండ్ విశ్రాంత ప్రయాణ మార్కెట్‌లో దాదాపు 15-20% వాటాను అందించే ఒక బంగారు గని. ఇటీవలి నెలల్లో భారతదేశం నుండి శ్రీలంకకు మైస్  ప్రయాణంలో బలమైన పెరుగుదల ధోరణిని మేము గమనించాము, ఇది 30% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. శ్రీలంకకు మైస్ రాకపోకలను రెట్టింపు చేయడానికి శ్రీలంక కన్వెన్షన్ బ్యూరోతో భాగస్వామ్యం చేసుకోవడానికి  శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ వద్ద మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. కీలకమైన భారతీయ నగరాల్లో జరిగే రోడ్ షోలు నిస్సందేహంగా మా ప్రయత్నాలను పెంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రముఖ మైస్ గమ్యస్థానంగా శ్రీలంక స్థానాన్ని బలోపేతం చేస్తాయి" అని అన్నారు. ఈ నెట్‌వర్కింగ్ సాయంత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీలంక పర్యాటక భాగస్వాములు, భారతీయ మైస్ ప్లానర్లు, కార్పొరేట్ ట్రావెల్ స్పెషలిస్ట్‌లు, ట్రావెల్ ట్రేడ్ పార్టనర్‌లు నేరుగా చర్చించటానికి వీలు కల్పించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!