రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సహాయార్థం తన వంతు సాయంగా జూ. ఎన్.టి.ఆర్. చెరో యాభై లక్షలు సి.ఎం. ఫండ్ కు అందజేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదే విధంగా నిర్మాత అశ్వనీదత్ తన వైజయంతి మూవీస్ నుంచి 25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. నటుడు విశ్వక్ సేన్ 5 లక్షలు ప్రకటించారు. ఇలా పలువురు తమ వంతు సాయంగా ప్రకటిస్తూనే వున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను అన్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలి వరదల బాధితులను ఆదుకునే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కి ₹5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.