మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల కాలంలో అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన నిర్మాణ సంస్థ. మహేష్ బాబుతో శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించింది. మహష్ బాబుకి అప్పటికి శ్రీమంతుడు కెరీర్ బెస్ట్. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ సినిమాని ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. ఈ సినిమా ఎన్టీఆర్‌కి అప్పటికి కెరీర్ బెస్ట్. మెగా పవర్ స్టార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ రంగస్థలం సినిమాని నిర్మించాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం రామ్ చరణ్‌కి కూడా కెరీర్ బెస్ట్ మూవీ.
ఇలా...మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలు ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ అందించాయి. ఇప్పుడు నాగ చైతన్యతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం సవ్యసాచి. ప్రేమమ్ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది.
ఆఖరికి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే.. ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసారు. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కెరీర్ బెస్ట్ అందించిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ నాగచైతన్యకు కూడా కెరీర్ బెస్ట్ అందిస్తుంది అనే టాక్ ఉంది. మరి.. మైత్రీ మూవీ మేకర్స్ సెంటిమెంట్‌ను సవ్యసాచి బ్రేక్ చేస్తుందా..? ఫాలో అవుతుందా..? అనేది తెలియాలంటే నవంబర్ 2 వరకు ఆగాల్సిందే.