Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

Advertiesment
Raj Tarun

దేవీ

, మంగళవారం, 18 నవంబరు 2025 (18:44 IST)
Raj Tarun
ఉయ్యాల జంపాల తో కెరీర్ ప్రారంభించినా అంతకుముందు షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో సినిమా రంగంలోకి వచ్చాడు రాజ్ తరుణ్. లవర్ బాయ్ గా కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఇటీవలే ఓ అమ్మాయిని ప్రేమించడం అది వివాదాస్పదంగా మారాడం, పెద్ద రాద్దాంతం కావడంతో కొంత గేప్ ఇచ్చాడు. అయినా ఆయనకు సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఫిక్స్ చేసినవే అని చెబుతున్నాడు. తాజాగా పాంచ్ మినార్ సినిమా చేశాడు. రాశి సింగ్ హీరోయిన్. రామ్ కడుముల దర్శకత్వం. ఈనెల 21న సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పాడు.
 
- పాంచ్ మినార్ సినిమాని ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాం. ఇది ప్రాపర్ క్రైమ్ కామెడీ. కథ నుంచి బయటికి వెళ్లకుండా జానర్ కి తగ్గట్టు ప్రతి సిచువేషన్ లోనూ మంచి ఫన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాకు కథ వినగానే చాలా నచ్చింది. నిర్మాతలు సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. మేము అడిగిన ఆర్టిస్టులని ఇచ్చారు. సినిమా మేము అనుకున్న దాని కంటే చాలా బెటర్ గా వచ్చింది.
 
గతకొంత కాలంగా మీ నుంచి వస్తున్న సినిమాలు అనుకున్న రీచ్ సాదిస్తున్నాయా?  
-ఇప్పటివరకు నేను చేసిన సినిమాల ప్రతి కథలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏదో కొత్త పాయింట్ చెప్పారు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాల్లో కూడా అలాంటి ఒక కొత్తదనం ఉంది.
 
-నా గత కొన్ని సినిమాల్లో అనుకున్నంత రీచ్ కాలేదు. అయితే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈ సినిమా మాత్రం తప్పకుండా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. నాకు నా కెరియర్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేదు.  నేను గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అవి ఒక్కొక్కటిగా వస్తున్నాయి.
 
మీ జర్నీ పట్ల హ్యాపీగా ఉన్నారా ?
-చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కడో వైజాగ్లో చిన్న కెమెరాలతో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నేను 20 ఫీచర్ ఫిలిమ్స్ చేశాను. ఇంతకంటే ఏం కావాలి. ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ని నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
 
మీరు డైరెక్షన్ కూడా చేస్తారని విన్నాం?  
-నేను కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. అయితే అది ఇప్పుడే కాదు. డైరెక్షన్ చేయాలంటే ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది.
 
మీ నుంచి కొత్తగా రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి  ?
-నిన్న ఓపెనింగ్ చేసిన సినిమా మంచి థ్రిల్లర్. రామ్ భజరంగ్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో హై యాక్షన్ ఉంటుంది. తెలుగు తమిళ్ లో చేస్తున్న సినిమా కూడా డిఫరెంట్ జానర్ సినిమా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్