Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

Advertiesment
Dileep, Raashi Singh

దేవీ

, శనివారం, 16 ఆగస్టు 2025 (09:28 IST)
Dileep, Raashi Singh
పార్వతి దేవదాసుల ప్రేమ కథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు టైటిల్ తో ఓ విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట రామకృష్ణ దర్శక నిర్మాత గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా రాశి సింగ్ హీరోయిన్ గా నటించారు. రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు.
 
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు  చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాత తోట రామకృష్ణ తెలియజేశారు.  సంగీత దర్శకుడు మోహిత్ రహమానియాక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ తో పాటు సుద్దాల అశోక్ తేజ,  భాస్కరభట్ల ఆకట్టుకునే సాహిత్యం అందించారు.
 
నటీ నటులు : సిద్దార్థ్ మీనన్, దిలీప్, రాశి సింగ్, రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత.
బ్యానర్ : మాహిష్మతి ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం, నిర్మాత : తోట రామకృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : మోహిత్ రహమానియాక్
సినిమాటోగ్రాఫర్ : శ్రీనివాసరాజు
ఎడిటర్ : గన్
గీత రచయితలు : చంద్ర బోస్ (ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్), సుద్దాల అశోక్ తేజ, భాస్కర భట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శరత్ వర్మ
పి ఆర్ ఓ : GK Media (గణేష్, కుమార్).

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్