బాలీవుడ్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువనటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్ పుత్ ముంబై అంధేరీలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించాడు.
గత రెండు రోజులుగా ఆదిత్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. సోమవారం తన అపార్ట్‌మెంట్‌లోని బాత్రూమ్‌లో ఆయన కుప్పకూలిపోయాడు.
ఆయన ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే బిల్డింగ్ సెక్యూరిటీకి సమాచారం అందించింది. ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు రిజిస్టర్ చేశారని పోలీసులు తెలిపారు.