Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరణ్యతో మ‌రింత గుర్తింపు వచ్చింది: సంపత్ రామ్

Advertiesment
అరణ్యతో మ‌రింత గుర్తింపు వచ్చింది: సంపత్ రామ్
, శనివారం, 27 మార్చి 2021 (19:20 IST)
Sampath Ram
రానా దగ్గుబాటి, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో ప్రభు సాల్మన్ తెరకెక్కించిన సినిమా ఆరణ్య. ఇటీవ‌లే విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇందులో క్రూర‌మైన పోలీసు అధికారిగా న‌టించాడు సంప‌త్‌రాజ్. అట‌వీ సంర‌క్ష‌ణ‌కోసం న్యాయం చేయ‌మ‌ని పోలీస్ స్టేష‌న్‌కు రానా (అర‌ణ్య‌) వ‌స్తే, ప‌ట్టించుకోకుండా కుక్క‌తో ఆడుకుంటూ దాన్ని తిడుతూ, అర‌ణ్య‌ను కేర్‌చేయ‌కుండా రెచ్చ‌గొట్టేధోర‌ణిలో మాట్లాడి చివ‌రికి అర‌ణ్య జైలుకెళ్ళేలా చేస్తాడు. ఇది సినిమాలో కీల‌క స‌న్నివేశం. ఈ పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు సంప‌త్‌రాజ్‌. ఈ సినిమాతో తనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది అంటున్నారు సంపత్ రామ్. 
 
తెలుగు, తమిళ  సినిమాలతో గత 20 ఏళ్లుగా ఈయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలు చేసిన సంపత్ రామ్.. ఇప్పుడు అరణ్యలో గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాళహస్తి పక్కన కాట్రపల్లి గ్రామంలో జన్మించారు ఈయన. చిన్ననాటి స్నేహితుడు కోలా ఆనంద్.. సంపత్ రామ్ ను సినిమాలకు పరిచయం చేశారు. సంచలన దర్శకుడు శంకర్ నటించిన ముదాళ్వాన్ సినిమాలో ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దీనా సినిమాలో మంచి పాత్ర వేశారు. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఎవరైనా ఎపుడైనా సినిమాలో ఒక పాత్రలో నటించారు. 
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ లో కూడా కీలక పాత్రలో నటించారు. సంపత్ రామ్ తమిళంలో అజిత్, విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్.. మలయాళంలో మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్స్ తో నటించారు సంపత్. ఇప్పటి వరకు దాదాపు 200 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు ఈయన. ఇప్పుడు అరణ్య సినిమాతో తనకు మరింత గుర్తింపు వచ్చిందని సంతోష పడుతున్నారు సంపత్. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప.. రానా 1945.. రెజీనా సినిమాలలో నటిస్తున్నారు సంపత్ రామ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఫిట్‌నెస్ యాక్ష‌న్ సీన్‌కు ఉప‌యోగ‌ప‌డిందిః హీరోయిన్ సయామి ఖేర్‌