Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా ఓ ఐటం రాణి, పులుసు పాప: బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Advertiesment
Bandla Ganesh-Roja

ఐవీఆర్

, మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (14:12 IST)
బండ్ల గణేష్. తీవ్ర విమర్శలకు, సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా చెబుతుంటారు. ఈసారి ఆయన గురి ఏపీ మంత్రి రోజాపై ఎక్కుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోజా విమర్శించడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం రేవంత్ రెడ్డిని గూర్చి మాట్లాడే స్థాయి రోజాకు లేదని అన్నారు.
 
అసలు వచ్చే ఎన్నికల్లో రోజాకి టిక్కెట్ వస్తుందో రాదో చెప్పలేని స్థితిలో ఆమె వుందన్నారు. రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అని రోజా అనడంపై మాట్లాడుతూ... నాన్న చనిపోతేనో, నాన్న వారసత్వంతోనో సీఎం అయినవారిని యాక్సిడెంటల్ సీఎం అంటారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కిందిస్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగి ఓ మహానాయకుడయ్యారని అన్నారు.
 
రోజా ఓ డైమండ్ రాణి అని, ఆమె పులుసు వండి పెట్టింది కనుక రోజా పులుసు పాప అని అన్నారు. ఆమె మాజీ అయ్యేందుకు ఇక ఎంతో కాలం లేదనీ, అలా అయ్యాక త్వరలో ఇక్కడ హైదరాబాదులో జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకోవచ్చని ఎద్దేవా చేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలయాళ స్టార్ మమ్ముట్టితో సమంత ఏం చేస్తోంది?