Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్ ఫోర్స్ వారు ఇలాంటి సినిమాలు వద్దన్నారు - టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు: మెగాస్టార్ చిరంజీవి

chiru- Varun

డీవీ

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (07:31 IST)
chiru- Varun
వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రూపొందింది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.  నేను అమెరికాలో వుండగానే వరుణ్.. డాడీ.. అంటూ మెసేజ్ పెట్టాడు. నేను వచ్చాక.. నా సినిమా పంక్షన్ జరుగుతుంది. ముందుగా మీరు రావాలి. అని అన్నాడు. బోర్డర్ హీరోస్ మన కోసం ఫైట్ చేస్తున్నారు.  మీరు వస్తేనే న్యాయం జరుగుతుందని అన్నాడు. అందుకే ఈ ఫంక్షన్ కు రావడం గర్వంగా వుంది.
 
webdunia
Operatin waletain prerelease
పుల్వామాలో జరిగిన టెర్రరిస్టు ఎటాక్ లో 40 మంది జవాన్లు చనిపోయారు. ట్రైలర్ లో చూపించాడు. చాలా హ్రుదయవిదారకంగా వుంది. అందుకే ఈ సినిమా వారికి నివాళిగా అనుకుంటున్నాను.
 
ఫిబ్రవరి 14 న సర్జికల్ స్ట్రయిక్ జరిగింది. అందుకే వాలెంటైన్ డే అని పేరు పెట్టాం అని చెప్పాడు ఇక దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రాజస్థాన్ యువకుడు. తెలుగులో అవకాశాలు కోసం వచ్చాడనుకుంటా. తను మిలట్రీవారిపై రీసెర్చ్ చేస్తుంటాడు. ఐదు లక్షలతో షార్ట్ ఫిలిం తీసి మిలట్రీవారికి చూపించాడు. అది చూసి వారే ఆశ్చర్యపోయారు. మాకు తెలీని విషయాలు కూడా చూించాం. ఇది  జనాలకు తెలియకూడదు. కనుక ఇకపై ఇలాంటివి తీయవద్దు అన్నారు. అందుకే ఈ సినిమాను యదార్థగాధగా కొంత ఇన్ ఫర్ మేషన్ వారి నుంచే తీసుకుని ఆపరేషన్.. సినిమా తీశాడు.
 
మనకు జనగణమన పాట వినగానే లేచి నులుచుకుంటాం. అలా దేశభక్తి ప్రేరేపితమైన కథ ఇది. ముఖ్యంగా యూత్ సినిమాను చూడాలి.
 
ఇక వరుణ్ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. తనకు నచ్చిన విభిన్నమైన సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఎయిర్ ఫోర్స్ పై తీసిన తొలి సినిమా ఇదే. గత ఏడాది టాప్ గన్ అనే హాలీవుడ్ సినిమా చూసి ఇలాంటిది చేయగలమా? అనుకున్నా. ఇప్పుడు ఆపరేషన్ వాలైంటైన్ సినిమా అలాంటి స్థాయి సినిమా. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు అన్నారు.
 
వరుణ్ తేజ్ మాట్లాడుతూ, మా పెద్ద నాన్నే నాకు స్పూర్తి. ఈ ఫంక్షన్ కు రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా వుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రౌండ్ మూవీ ఎలా వుందంటే... రివ్యూ